Mallikarjun Kharge Meeting Daughter: తెలంగాణ మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో బెంగళూరులో హఠాత్తుగా సమావేశమయ్యారు. సుమారు 15 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో, ఇటీవల సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, వాటి తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలపై ఖర్గే ఆరా తీశారు. పార్టీకి ఇబ్బంది కలిగించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని, బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు క్రమశిక్షణతో, జాగ్రత్తగా వ్యవహరించాలని ఖర్గే సూచించినట్లు తెలుస్తోంది.
ఖర్గే ప్రశ్నలకు కొండా సురేఖ వివరణ ఇచ్చారు. అసలు ఘటన ఏంటి, వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏమిటి, ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఆయనకు వివరించినట్లు సమాచారం. రాష్ట్రంలోని కొందరు ముఖ్య నేతలను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరినా సమయం ఇవ్వకపోవడంతో, పరిస్థితిని వివరించేందుకు నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలవాల్సి వచ్చిందని సురేఖ తెలిపినట్లు తెలుస్తోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా