Gold and silver Rates climbing high: ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్యూర్ గోల్డ్ రేటు గ్రాముకు రూ.17 వేల దిశగా వెళ్తుండగా, వెండి ధర కూడా మూడు రోజుల్లో రూ.20 వేలు పెరిగింది. శుభకార్యాల సీజన్ కావడంతో బంగారం కొనాలనుకునే ప్రజలు తమ నగరాల్లోని తాజా ధరలను తెలుసుకోవడం మంచిది. ఆగస్టు 22న 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.152 పెరిగి హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో రూ.16,309గా ఉంది. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,950గా కొనసాగుతోంది.
ఆగస్టు 22న దేశవ్యాప్తంగా వెండి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లో మాత్రం పెరిగాయి. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కిలో వెండి ధర రూ.5 వేలు పెరిగి రూ.2.70 లక్షలకు చేరింది. అంటే గ్రాము వెండి ధర సుమారు రూ.270గా ఉంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
మంగళవారం పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో వెండి రేటు కేజీ ఎంత ఉందంటే?