Irumudi Day 1 Collections

Irumudi Day 1 Collections: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ ఆగస్టు 21న విడుదలై తొలి రోజే మంచి స్పందన అందుకుంది. ఫాదర్-డాటర్ ఎమోషన్‌తో పాటు రివేంజ్ యాక్షన్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా భారత్‌లో మొదటి రోజు రూ.14.80 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా రూ.24.20 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో తాగుడుకు బానిసైన తండ్రి, కూతురి కోరిక మేరకు అయ్యప్ప దీక్ష తీసుకున్న తర్వాత ఎదుర్కొనే మార్పులు, సవాళ్లే ప్రధాన కథాంశం. రవితేజ నటన, తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఇదే జోరు కొనసాగితే సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మరోవైపు ‘ఇరుముడి’ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ.14 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఓటీటీలో అందుబాటులోకి రావచ్చని సమాచారం. ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లలో సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా కలెక్షన్లు, రికార్డులు ఎలా ఉంటాయో రాబోయే రోజుల్లో తేలనుంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

థియేటర్లలో రవితేజ ‘ఇరుముడి’ కలెక్షన్స్ సునామీ.. ఓటీటీ రిలీజ్‌పై అదిరిపోయే అప్‌డేట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *