Hanuman Ansh OTT Release: ఆధ్యాత్మిక కథాంశంతో తెరకెక్కి భారీ విజయం సాధించిన ‘హనుమాన్ అంశ్’ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. నీమ్ కరోలి బాబా జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా నవంబర్ 27 నుంచి హిందీలో సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ భాషల్లో నవంబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. 2026 ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది.
కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.452 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తల్లి మరణంతో బాధపడుతూ జీవితం, మరణం, ఆధ్యాత్మికత గురించి తెలుసుకునేందుకు ప్రయాణం చేసే లక్ష్మీనారాయణ్ కథను చూపించారు. ఈ ప్రయాణంలో అతడికి ఎదురైన అనుభవాలు, విశ్వాసం, భక్తి, మానవత్వం, ప్రేమ, కరుణ, నిస్వార్థ సేవ వంటి నీమ్ కరోలి బాబా బోధనలను ఈ చిత్రంలో హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అనిరుధ్-కావ్య మారన్ పెళ్లికి వేళాయే..
‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్..
External Links:
ఓటీటీలోకి వచ్చేసిన ‘హనుమాన్ అంశ్’.. తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?



