Mind Games of Gukesh

Mind Games of Gukesh: వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ 2026లో భాగంగా జరిగిన మూడో గేమ్ కూడా డ్రాగా ముగిసింది. అయితే ఈ గేమ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ డి. గుకేశ్ తన వేగవంతమైన ఆటతో ప్రత్యర్థి జవోఖిర్ సిందరోవ్‌ను ఆశ్చర్యపరిచాడు. కేవలం రెండు నిమిషాల్లోనే 15 మూవ్స్ ఆడుతూ బెర్లిన్ డిఫెన్స్‌లో కొత్త వేరియేషన్‌ను ఉపయోగించాడు. దీంతో సిందరోవ్ ఒత్తిడికి గురయ్యాడు. మ్యాచ్ డ్రాగా ముగిసినా, ప్రారంభంలోనే ప్రత్యర్థి సమయాన్ని తగ్గించి గుకేశ్ పైచేయి సాధించాడు. ఇప్పుడు నాలుగో గేమ్‌లో వైట్ పీసెస్‌తో దాడికి సిద్ధమవుతున్నాడు. ఓపెనింగ్స్ ఆటలో ఒక భాగం మాత్రమేనని, చివరకు గెలవడమే ముఖ్యమని గుకేశ్ తెలిపాడు.

మరోవైపు గుకేశ్ ప్రిపరేషన్, వేగవంతమైన ఆట తనను ఆశ్చర్యపరిచాయని సిందరోవ్ అంగీకరించాడు. ముఖ్యంగా 5…Be7 మూవ్‌ను తాము పరిశీలించినప్పటికీ, అంత లోతుగా ప్రిపేర్ కాలేదని చెప్పాడు. మొదట తనకు మంచి పొజిషన్ వచ్చిందని భావించినా, గుకేశ్ ప్రిపరేషన్ అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. వైట్ పీసెస్‌తో ఆడుతున్నందున గెలవడానికి ప్రయత్నించానని, అయితే ఎండ్‌గేమ్‌లో ఇద్దరి పొజిషన్లు సమానంగా ఉన్నాయని సిందరోవ్ తెలిపాడు. టైమ్ ట్రబుల్‌లో తప్పు చేసే పరిస్థితి ఎదురైనా, చివరకు బాగా డిఫెండ్ చేసుకోగలిగానని సంతోషం వ్యక్తం చేశాడు.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..

నిఖత్ జరీన్‌కు స్వర్ణం..

External Links:

2 నిమిషాల్లోనే గుకేశ్ 15 మూవ్స్.. సిందరోవ్‌కు చెమటలు పట్టించేలా మైండ్ గేమ్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *