Vijay Sethupathi

Vijay Sethupathi: 54వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్‌ (2026) వేడుకలు నవంబర్ 23న న్యూయార్క్‌లో జరిగాయి. ఈ వేడుకల్లో 22 దేశాలకు చెందిన 64 నామినేషన్లు 16 విభాగాల్లో పోటీపడ్డాయి. ఈసారి యూకే అత్యధికంగా 9 అవార్డులు గెలుచుకుంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి అవార్డు ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందారు. భారత్ నుంచి రెండు విభాగాల్లో నామినేషన్లు వచ్చినా అవార్డులు రాలేదు. వీర్ దాస్ కామెడీ స్పెషల్‌కు, ‘రియల్ కాశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్’ వెబ్‌సిరీస్‌కు అవార్డులు దక్కలేదు. కామెడీ విభాగంలో అర్జెంటీనాకు చెందిన ‘డివిజన్ పలెర్మో – సీజన్ 2’, డ్రామా విభాగంలో ఫ్రాన్స్‌కు చెందిన ‘కారేమ్’ అవార్డులు గెలుచుకున్నాయి.

ఈ కార్యక్రమానికి అమెరికన్ నటుడు మైఖేల్ యూరీ హోస్ట్‌గా వ్యవహరించారు. నెట్‌ఫ్లిక్స్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ బేలా బజారియాకు ఇంటర్నేషనల్ ఎమ్మీ ఫౌండర్స్ అవార్డు అందించారు. అలాగే వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గెర్హార్డ్ జైలర్‌కు డైరెక్టరేట్ అవార్డు ఇచ్చారు. అంతర్జాతీయ టెలివిజన్ రంగంలో ప్రతిభ చూపిన వారిని గుర్తించి ఈ అవార్డులను ప్రదానం చేశారు.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

అనిరుధ్-కావ్య మారన్ పెళ్లికి వేళాయే..

‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్..

External Links:

విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం..ఎమ్మీ అవార్డుల ప్రజెంటర్ గా రికార్డు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *