Samantha Raj nidimoru blessed with baby boy

Samantha Raj nidimoru blessed with baby boy: టాలీవుడ్ హీరోయిన్ సమంత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి తమ కుమారుడికి దేవ్ నిడిమోరు అని పేరు పెట్టారు. నవంబర్ 19, 2026న బాబు జన్మించగా, నవంబర్ 20న ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. చిన్నారి చేతిని పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ వార్త తెలియడంతో సినీ ప్రముఖులు, అభిమానులు సమంత దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సమంత, రాజ్ నిడిమోరు 2025 డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో సమంత తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. బిడ్డ పుట్టకముందు రాజ్ కుటుంబ సభ్యులు సంప్రదాయంగా సీమంతం వేడుక నిర్వహించి ఆమెకు ఆశీర్వాదాలు అందించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రాజ్ సోదరి శీతల్ నిడిమోరు సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా సమంత తల్లి కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆమె కొత్త జీవిత ప్రయాణం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నారు.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

అనిరుధ్-కావ్య మారన్ పెళ్లికి వేళాయే..

‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్..

External Links:

సమంత-రాజ్ దంపతులకు కొడుకు పుట్టాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *