Doctor Shivaranjani: హైదరాబాద్కు చెందిన పిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని సంతోష్ ఏడుగురు చిన్నారుల జీవితాల్లో కొత్త ఆశలు నింపారు. అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు అవసరమైన మందులను తక్కువ ధరకు అందించేలా కృషి చేశారు. అలన్ హెర్న్డన్ డడ్లీ సిండ్రోమ్ వ్యాధికి ఉపయోగించే తిరాట్రికాల్ మందు ఏడాదికి రూ.9 కోట్లు ఖర్చవుతుంది. అయితే ఆమె ప్రయత్నంతో ఆ మందును కేవలం రూ.2.5 లక్షలకే అందించేలా ఫార్మా కంపెనీని ఒప్పించారు. అంతేకాకుండా ఏడుగురు పిల్లలకు ఏడాది పాటు ఉచితంగా మందులు అందించేందుకు కంపెనీ అంగీకరించింది. నవంబర్ 30న ఈ మందులను పంపిణీ చేయనున్నారు.
డాక్టర్ శివరంజని గతంలో కూడా ప్రజల ఆరోగ్యం కోసం పోరాటం చేశారు. ORS పేరుతో నకిలీ పానీయాలు అమ్మడంపై ఎనిమిదేళ్ల పాటు పోరాడారు. దీంతో WHO ప్రమాణాలు లేని పానీయాలపై ORS పేరు వాడకూడదని FSSAI ఆదేశాలు జారీ చేసింది. పిల్లల ఆరోగ్యం, టీకాలు, డెంగ్యూ వంటి అంశాలపై తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా ఖరీదైన మందులను పేద కుటుంబాలకు తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావడానికి చేసిన కృషితో ప్రశంసలు అందుకుంటున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అనిరుధ్-కావ్య మారన్ పెళ్లికి వేళాయే..
‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్..
External Links:
రూ.9 కోట్ల మందు రూ.2.5 లక్షలకే.. పిలల్ల డాక్టర్ శివరంజని అద్భుత ప్రయత్నం