Telangana Inter Exams 2027

Telangana Inter Exams 2027: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) 2027 ఫిబ్రవరి/మార్చి ఇంటర్ పరీక్షల తాత్కాలిక టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. థియరీ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 20 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఫిబ్రవరి 24న, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫిబ్రవరి 25న పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ పరీక్షల్లో లాంగ్వేజ్, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కామర్స్ తదితర సబ్జెక్టులు ఉంటాయి. ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 19న, సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 20న ముగుస్తాయి.

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు, ఇంటర్నల్ అసెస్‌మెంట్ జనవరి 20 నుంచి ప్రారంభమవుతాయి. జనవరి 29, 30 తేదీల్లో ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. సెకండ్ ఇయర్ సైన్స్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, ఫస్ట్ ఇయర్ సైన్స్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు జరుగుతాయి. జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు థియరీ పరీక్షల తేదీలు వర్తిస్తాయి. అయితే ఒకేషనల్ కోర్సుల ప్రత్యేక టైమ్‌టేబుల్‌ను బోర్డు త్వరలో విడుదల చేయనుంది.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..

నిఖత్ జరీన్‌కు స్వర్ణం..

External Links:

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 24 నుంచి థియరీ పరీక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *