Telangana Cheyutha Pensions: తెలంగాణలో కొత్త చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం తేదీ ఖరారు చేసింది. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 4,63,857 మంది కొత్త లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో చేయూత పెన్షన్ డబ్బులను నేరుగా జమ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. అదే రోజు కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. కొత్త పెన్షన్ల ద్వారా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులకు నెలవారీ ఆర్థిక భరోసా లభించనుంది.
మహిళలకు గౌరవం, ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఇందిరమ్మ చీరలు తెలంగాణ సంప్రదాయానికి, ఆడబిడ్డల గౌరవానికి ప్రతీక అని తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు, ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. నవంబర్ 26 నుంచి ఈ రెండు కార్యక్రమాలను ప్రారంభించి అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు అందించనున్నట్లు వెల్లడించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..
External Links:
చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీకి తేదీ ఫిక్స్..