Telangana Irrigation Project: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు త్వరగా మంజూరు చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రధాని మోదీని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ఢిల్లీలో ప్రధానిని కలిసిన ఆయన.. పాలమూరు–రంగారెడ్డి, సీతమ్మసాగర్, డిండి ప్రాజెక్టుల సమస్యలను వివరించారు. నాలుగు ప్రాజెక్టులకు రూ.5,856 కోట్లు, పూర్తికావస్తున్న పనులకు రూ.5,000 కోట్లు, భూగర్భ జలాల పరిరక్షణకు మరో రూ.5,000 కోట్ల సాయం కోరినట్లు తెలిపారు.
మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీటిని ఎత్తిపోయడం ప్రస్తుతం సాధ్యం కాదని నిపుణులు చెప్పినట్లు ఉత్తమ్ వెల్లడించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలోనూ లోపాలు ఉన్నాయని తెలిపారు. వచ్చే వానాకాలం వరకు తాగునీటికి సరిపడా నీరు ఉందని, యాసంగిలో వరి సాగు చేయవద్దని రైతులకు సూచించారు. అలాగే సమ్మక్క–సారలమ్మ బ్యారేజీ అనుమతుల కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో చర్చించనున్నట్లు చెప్పారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..
External Links:
మేడిగడ్డపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కీలక విన్నపాలు