23 Month Old Rudransh Thakur

23 Month Old Rudransh Thakur: మహారాష్ట్రకు చెందిన 23 నెలల చిన్నారి రుద్రాంశ్ ఠాకూర్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్‌గా మారాడు. తల్లిదండ్రులతో కలిసి కొత్త స్కూటర్ కొనడానికి షోరూంకు వెళ్లిన సమయంలో అతడు ఇచ్చిన స్టైలిష్ ఫోజులు అందరినీ ఆకట్టుకున్నాయి. కళ్లకు సన్‌గ్లాసెస్ పెట్టుకుని, స్టైలిష్ దుస్తులు ధరించి, రెండు చేతులను జేబుల్లో పెట్టుకుని స్కూటర్ ముందు మోడల్‌లా ఫోజులిచ్చాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లోని @bhonduuu_baccha పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోకు 12.5 కోట్లకు పైగా వ్యూస్, దాదాపు 90 లక్షల లైక్స్ వచ్చాయి. అతడి స్టైల్ చూసి నెటిజన్లు ‘చోటా డాన్’ అని ముద్దుగా పిలుస్తున్నారు. హోండా కొత్త చైర్మన్ వచ్చాడంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

రుద్రాంశ్ వీడియో వైరల్ కావడంతో మరో ఆసక్తికర విషయం కూడా వెలుగులోకి వచ్చింది. షోరూం యజమాని అతడిని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారని, నర్సరీ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు చదువు ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రుద్రాంశ్ తల్లి మాట్లాడుతూ, అతడు తనకు తానుగానే ఈ ఫోజులు ఇచ్చాడని తెలిపారు. షోరూం ముందు తీసిన చిన్న వీడియో ఇంత పెద్ద స్థాయిలో వైరల్ అవుతుందని తాము అసలు ఊహించలేదని చెప్పారు. కొద్ది రోజుల క్రితం వరకు కుటుంబ సభ్యులు, బంధువులకు మాత్రమే తెలిసిన రుద్రాంశ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..

నిఖత్ జరీన్‌కు స్వర్ణం..

External Links:

స్కూటర్ ముందు నిలబడి ఓ లుక్కిచ్చాడు అంతే.. బుడ్డోడి స్వాగ్‌కి నెటిజన్లు ఫిదా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *