Kulgam Terror Attack: జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లా అఖ్రాన్ సమీపంలో ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపారు. బుధవారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో నకా వద్ద విధులు నిర్వహిస్తున్న జవాన్లపై మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడినట్లు సమాచారం.
వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టారు. గాయపడిన సిబ్బందిని చికిత్స కోసం అనంత్‌నాగ్ జిల్లాలోని ఆస్పత్రికి తరలించారు. పరారైన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ ఘటన నేపథ్యంలో కుల్గాం జిల్లాలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..
External Links:
సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి..