Anthropic CEO: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైద్య రంగంలో పెను మార్పులు తీసుకురానుందని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయి అన్నారు. ఏఐ సాయంతో క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులు వంటి వ్యాధులకు రాబోయే పదేళ్లలో పరిష్కారాలు లభించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాన్ మస్క్, డెమిస్ హసాబిస్ కూడా ఏఐతో ఔషధాల అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. ఆల్ఫాఫోల్డ్ ఇందుకు మంచి ఉదాహరణగా నిలిచింది.
అయితే, ఔషధాల తయారీలో ఏఐ సామర్థ్యంపై ఫార్మా నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సుమారు 50 ఏఐ కంపెనీల టెక్నాలజీని, 10 వేల ఔషధ సమ్మేళనాలను పరిశీలించినా, కొత్త ఔషధాన్ని స్వతంత్రంగా రూపొందించలేకపోయాయని వెర్టెక్స్ ఛైర్మన్ జెఫ్ లీడెన్ తెలిపారు. ఔషధాల భద్రత, ప్రభావాన్ని నిర్ధారించేందుకు ల్యాబ్ పరీక్షలు, జంతువులపై ప్రయోగాలు, క్లినికల్ ట్రయల్స్ తప్పనిసరి అని పేర్కొన్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పుతిన్ యుద్ధాన్ని ఎందుకు సాగదీస్తున్నారో అర్థం కావడం లేదు…
ఇజ్రాయెల్ నుంచి ట్రంప్‌కు అత్యున్నత గౌరవం: ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ ప్రకటింపు
External Links:
10 ఏళ్లలో క్యాన్సర్ లేని ప్రపంచం.. ఏఐపై భారీ అంచనాలు..