Cancer Drug Prices Slashed: క్యాన్సర్ రోగులకు ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే 137 రకాల మందులకు చెందిన 1,031 ఫార్ములేషన్ల ధరలను గరిష్టంగా 96.45 శాతం వరకు తగ్గించింది. కొత్త ధరలు దేశవ్యాప్తంగా అమల్లోకి రాగా, మెడికల్ షాపులు, ఆసుపత్రులు తప్పనిసరిగా సవరించిన MRP ప్రకారమే మందులను విక్రయించాలి.
ఈ నిర్ణయంతో ఖరీదైన మందులు కొనలేక ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరట లభించనుంది. క్యాన్సర్ రోగులు, వారి కుటుంబ సభ్యులు మందులు కొనుగోలు చేసే ముందు ప్యాకెట్లపై ఉన్న కొత్త MRPని తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచించారు. పూర్తి ధరల వివరాల కోసం NPPA అధికారిక వెబ్సైట్ https://nppa.gov.in ను సందర్శించవచ్చు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
క్యాన్సర్ రోగులకు కేంద్రం భారీ ఊరట.. గరిష్టంగా 96.45% వరకు తగ్గిన ఔషధాల ధరలు.!