Gold Rates

Gold price decreased: దీపావళి తర్వాత నుంచి బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. నవంబర్ 8న దీపావళి రోజు హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,570గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,600గా ఉంది. అయితే నవంబర్ 17 నాటికి 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,350కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,600కు పడిపోయింది. దీంతో వారం రోజుల్లోనే బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ పతనం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తుండగా, పెళ్లిళ్ల సీజన్, శుభకార్యాల సమయంలో ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అమెరికా డాలర్ విలువ పెరగడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉండటంతో పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుని డిపాజిట్లు, బాండ్ల వైపు మళ్లిస్తున్నారు. మరోవైపు డాలర్ విలువ పెరగడంతో ఇతర దేశాల్లో బంగారం కొనుగోళ్లు తగ్గాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గి, భారతదేశానికి బంగారం సరఫరా పెరిగింది. సరఫరా పెరగడం, డిమాండ్ తగ్గడం కూడా దేశంలో బంగారం ధరలు పడిపోవడానికి కారణాలుగా మారాయి.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…

ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..

External Links:

బంగారానికి ఏమైందీ.. వారం రోజుల్లో రూ.10 వేలు తగ్గింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *