Telangana Healthcare Reforms: తెలంగాణలో వైద్యారోగ్య వ్యవస్థను బలోపేతం చేసి పేదలకు మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వైద్యం కోసం పేదలు అప్పులు చేయకూడదని, చికిత్స కోసం ఎక్కువ రోజులు వేచి చూడకూడదని అన్నారు. ఈ లక్ష్యంతో వైద్య శాఖలో పలు మార్పులు చేపడుతున్నట్లు వెల్లడించారు. వచ్చే జూన్ 2 నాటికి టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నిమ్స్ విస్తరణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి కొత్త ఉస్మానియా ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కవరేజీని రూ.10 లక్షలకు పెంచామని సీఎం తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను 30 వేల నుంచి 38 వేలకు పెంచడంతో పాటు, ఇప్పటివరకు 13,401 మంది వైద్య సిబ్బందిని నియమించామని వెల్లడించారు. మరో 5,640 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించాలని, వైద్య ఖర్చుల కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదని ప్రభుత్వం కృషి చేస్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..
External Links:
వైద్యం కోసం ఏ పేద కుటుంబమూ అప్పులపాలు కాకూడదు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన