Nagarjuna Inaugurate Thammidikunta Lake: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చెరువుల ఆక్రమణల వల్లే నగరంలో చిన్న వర్షానికే వరదలు వస్తున్నాయని అన్నారు. మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని, ఎవరికీ అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. తమ్మిడికుంట అభివృద్ధికి సహకరించిన నటుడు నాగార్జునను అభినందించారు. చెరువులను ‘లేక్ ఎకానమీ’గా అభివృద్ధి చేసి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
నటుడు నాగార్జున చెరువు అభివృద్ధిని ప్రశంసిస్తూ, మరో 2 వేల చెరువులను పునరుద్ధరించాలని కోరారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ 10 చెరువులను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. తమ్మిడికుంటను 15 నుంచి 30 ఎకరాలకు విస్తరించి అభివృద్ధి చేశామని, వరదల నివారణకు చెరువుల పునరుద్ధరణ ఎంతో అవసరమని తెలిపారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..
External Links:
నీళ్ల నివాసాన్ని ఆక్రమిస్తే.. మన నివాసాలనే ఆక్రమిస్తాయి..