Revanth Reddy Birthday Wishes: మనలో చాలామంది ఇష్టమైన వారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతుంటారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. పొలంలో వరి నారుతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని రూపొందించారు. ఈ నెల 8న సీఎం పుట్టినరోజు ఉండటంతో, దాదాపు 20 రోజుల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని తయారు చేయించారు.
రైతు రుణమాఫీ చేసినందుకు సీఎంపై తమకున్న అభిమానాన్ని చాటుకునేందుకు ఈ ప్రత్యేక చిత్రాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. వరి నారుతో పొలంలోనే రేవంత్ రెడ్డి రూపాన్ని తీర్చిదిద్ది ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా మెట్టు సాయికుమార్ చేసిన ఈ వినూత్న కార్యక్రమం స్థానికంగా అందరినీ ఆకట్టుకుంటోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..
External Links:
వరి నారుతో సీఎం ‘రేవంత్ రెడ్డి’ చిత్రపటం.. వినూత్నంగా బర్త్డే విషెస్ తెలిపిన కాంగ్రెస్ నేత.!