AP MPTC ZPTC Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, భద్రతా చర్యలు, పోలింగ్ నిర్వహణపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఓటర్లతో మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. అన్ని ఏర్పాట్లు బాగున్నాయని, ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు, రాజకీయ పార్టీలు ఎన్నికల నిర్వహణలో బాధ్యతగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ పూర్తవుతుందని ఆశిస్తున్నామని, అనంతరం బ్యాలెట్ బాక్సులను పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తామని కమిషనర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లలో సీసీటీవీ నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలింగ్ ముగియడానికి ఇంకా సమయం ఉన్నందున ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అనిల్ చంద్ర పునేఠ విజ్ఞప్తి చేశారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..
External Links:
మున్సిపల్ కౌంటింగ్‌లో సత్తా చాటుతున్న కూటమి.. వైసీపీకి షాకిస్తున్న ట్రెండ్స్..