Meta Offers Huge Severance: టెక్ రంగంలో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్న నేపథ్యంలో మెటా సంస్థ కూడా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (Voluntary Exit) ఆఫర్‌ను ప్రకటించింది. ఫ్రాన్స్‌లోని 300 మంది ఉద్యోగుల్లో సుమారు 100 మందిపై ఈ ఆఫర్ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉద్యోగం వదిలే వారికి ప్రతి ఏడాది సర్వీసుకు 2.15 నెలల జీతంతో పాటు, 10 నెలల పాటు 80 శాతం జీతం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి లేదా వ్యాపారం ప్రారంభించడానికి సహాయం అందించనుంది. మరోవైపు గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు కూడా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకు ఇలాంటి ఆఫర్లు ప్రకటించాయి.
ఏఐ టెక్నాలజీపై భారీగా పెట్టుబడులు పెడుతున్న మెటా గతంలోనూ వేలాది ఉద్యోగాలను తగ్గించింది. 2026 నాటికి డేటా సెంటర్లు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 135 నుంచి 145 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ‘మ్యూజ్’ పేరుతో పర్సనల్ ఏఐ ఏజెంట్ల అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
అసలు.. గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ జామ్ ఎలా తెలుస్తుంది? దీని వెనుక అసలు టెక్నాలజీ ఇదే!