Mahadev Betting App: మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. యాప్ సహ-వ్యవస్థాపకుడు రవి ఉప్పల్‌ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరో నిందితుడు సౌరభ్ చంద్రకర్‌ను భారత్‌కు రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులకు ముడుపులు అందినట్లు ఈడీ దర్యాప్తులో ఆరోపణలు వెలుగుచూశాయి. యాప్ ద్వారా సుమారు రూ.94,000 కోట్ల లావాదేవీలు జరగగా, ప్రమోటర్లు రూ.4,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల వరకు లాభపడినట్లు అంచనా.
ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా పట్టుబడిన రవి ఉప్పల్‌ను భారత్‌కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అతడిని విచారిస్తే ఈ కుంభకోణంలో డబ్బులు అందుకున్న రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల పేర్లు బయటపడే అవకాశం ఉంది. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిలో ఆందోళన నెలకొంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రేణు అగర్వాల్ దారుణ హత్య