Raptadu School Attack: అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన నిందితుడిని పోలీసులు ధర్మవరంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పాఠశాలలోకి చొరబడిన నిందితుడు బాలిక గొంతు, ముఖంపై దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కుడి చేయి తెగిపోవడంతో రక్తపు మడుగులో పడిపోయిన విద్యార్థినిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అత్యవసర విభాగంలో చికిత్స పొందుతోంది. వైద్యులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, రెండో పీరియడ్ క్లాస్ జరుగుతున్న సమయంలో నిందితుడు పాఠశాలలోకి వచ్చి దాడి చేశాడని క్లాస్ టీచర్ తెలిపారు. అతడిని చూసి విద్యార్థులు భయంతో పరుగులు తీశారని, నిందితుడు ఒక్కడే వచ్చి దాడికి పాల్పడ్డాడని వివరించారు. రేపు పోలింగ్ ఉండటంతో పాఠశాలలో కేవలం ఐదుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రేణు అగర్వాల్ దారుణ హత్య

ఎర్రకోటలో భారీ చోరీ…

External Links:

బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *