Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మిచిగాన్ నుంచి డెమోక్రటిక్ పార్టీ తరఫున సెనేట్‌కు పోటీ చేస్తున్న అబ్దుల్ అల్-సయ్యద్‌ను ఉద్దేశించి ‘‘అబ్దుల్ ఎలా ఉన్నావు? నువ్వొక జిహాదీవి’’ అని వ్యాఖ్యానించారు. గతంలో కూడా ఆయనను ముస్లిం బ్రదర్‌హుడ్‌కు చెందిన జిహాదీ సభ్యుడిగా ట్రంప్ అభివర్ణించారు. అంతేకాకుండా, 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన ఉగ్రదాడులను ప్రస్తావిస్తూ, అబ్దుల్ ఎన్నికల్లో గెలిస్తే సెనేట్‌లోకి వెళ్లే ముందు మెటల్ డిటెక్టర్లతో భద్రతా తనిఖీలు చేయాలని అన్నారు. ఆయన కుటుంబానికి ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. అబ్దుల్‌కు జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు.
మరోవైపు, ఫ్లోరిడాలోని డేటోనా బీచ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్‌కు నిరసన ఎదురైంది. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో నిరసనకారులు నాలుగుసార్లు అడ్డుతగిలారు. దీంతో ఆగ్రహానికి గురైన ట్రంప్ ‘‘నోరు మూయ్.. ఇతడిని ఇక్కడి నుంచి తీసుకెళ్లండి’’ అంటూ మండిపడ్డారు. ఇదిలా ఉండగా, అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఇప్పటికే 4.3 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
“అబ్దుల్.. నువ్వొక జిహాదీవి”.. డెమోక్రటిక్ అభ్యర్థిపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు