Gold and Siver cost are crash: దీపావళి పండుగ దగ్గర పడుతుండటంతో బంగారం, వెండి కొనాలనుకునే వారికి మంచి అవకాశం వచ్చింది. వరుసగా తగ్గుతున్న ధరలతో జ్యువెలరీ షాపులకు ప్రజలు ఎక్కువగా వెళ్తున్నారు. పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నప్పటికీ, ఆభరణాలు కొనాలనుకునే వారికి ఈ వీకెండ్ అనుకూలంగా ఉంది. అక్టోబర్ 31న బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం గ్రాముపై రూ.338 తగ్గడంతో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో గ్రాము ధర రూ.13,888గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.12,730గా కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. అక్టోబర్ 31, 2026న కిలో వెండిపై దేశవ్యాప్తంగా రూ.10,000 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో కిలో వెండి ధర రూ.2 లక్షలకు చేరింది. అంటే గ్రాము వెండి ధర సుమారు రూ.200గా ఉంది. రానున్న రోజుల్లో వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
శుక్రవారం కుప్పకూలిన బంగారం, వెండి.. హైదరాబాదులో తగ్గిన రేట్లివే షాపర్స్!