Silver and Gold rates are crashed: బంగారం, వెండి ధరలు శుక్రవారం భారీగా తగ్గాయి. రెండు రోజుల్లో వెండి ధర కిలోకు రూ.10 వేల వరకు తగ్గడంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపిందని నిపుణులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దీపావళి నాటికి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 30న 24 క్యారెట్ల బంగారం గ్రాముపై రూ.169 తగ్గి రూ.14,226కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.13,040గా ఉంది.
మరోవైపు వెండి ధర కూడా అక్టోబర్ 30న కిలోకు రూ.5,000 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో కిలో వెండి ధర రూ.2.10 లక్షలకు చేరింది. అంటే గ్రాము వెండి ధర సుమారు రూ.210గా ఉంది. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొనుగోలుదారులు తమ నగరాల్లోని రిటైల్ ధరలను పరిశీలించి కొనుగోలు చేయడం మంచిది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
శుక్రవారం కుప్పకూలిన బంగారం, వెండి.. హైదరాబాదులో తగ్గిన రేట్లివే షాపర్స్!