2026 Match Time Squad: భారత్, పాకిస్థాన్ జట్లు మరోసారి క్రికెట్ మైదానంలో తలపడనున్నాయి. అక్టోబర్ 30న ప్రారంభమయ్యే హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నీలో తొలి రోజే ఈ రెండు జట్లు గ్రూప్-సిలో తలపడనున్నాయి. ఇటీవల ఆసియా గేమ్స్ ఫైనల్లో పాకిస్థాన్‌పై గెలిచి స్వర్ణ పతకం సాధించిన భారత్, మరోసారి అదే జట్టుతో పోటీ పడనుంది. ఈ టోర్నీ సాధారణ టీ20 మ్యాచ్‌లకు భిన్నంగా ఉంటుంది. ఇందులో ఒక్కో జట్టులో ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. ఒక్కో ఇన్నింగ్స్‌కు 6 ఓవర్లు కేటాయిస్తారు. ఫైనల్లో మాత్రం 8 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. మొత్తం 12 దేశాలు పాల్గొనే ఈ టోర్నీ మ్యూంగ్ కాక్‌లోని మిషన్ రోడ్ గ్రౌండ్లో జరగనుంది. అక్టోబర్ 30న ప్రారంభమై నవంబర్ 1న ఫైనల్‌తో ముగుస్తుంది.
ఈ టోర్నీలో భారత జట్టుకు ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జట్టులో శశాంక్ సింగ్, రాహుల్ తెవాటియా, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, టి. నటరాజన్, కుల్వంత్ ఖేజ్రోలియా ఉన్నారు. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ జట్టుకు అబ్బాస్ అఫ్రిది నాయకత్వం వహించనున్నాడు. అబ్దుల్ సమద్, అహ్మద్ దానియల్, మొహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఖ్వాజా నఫే, మొహమ్మద్ షెహజాద్, సాద్ మసూద్ జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. దీంతో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..
External Links:
నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..