TGPSC recruitment 2026

TGPSC recruitment 2026: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ శాఖలో 102 మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అన్‌రిజర్వ్డ్, బీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.500గా నిర్ణయించారు. పరీక్ష ఫీజు అందరికీ రూ.80. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, పేపర్-2లో డిగ్రీ స్థాయి స్టాటిస్టిక్స్ నుంచి 150 ప్రశ్నలు చొప్పున మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష 2027 జనవరిలో జరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం tgpsc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..

నిఖత్ జరీన్‌కు స్వర్ణం..

External Links:

TGPSC నుంచి 102 ఉద్యోగాలు.. మండల ప్లానింగ్, స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *