Indian Railways: ఇండియన్ రైల్వే ప్రయాణికుల భద్రత దృష్ట్యా రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రైళ్లలో ఛార్జింగ్ పాయింట్లను ఆఫ్ చేయాలని ఆదేశించింది. ఇటీవల సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో ఛార్జింగ్‌లో ఉన్న పవర్ బ్యాంక్ పేలడంతో బోగీ అంతా పొగలు వ్యాపించాయి. పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రైల్వే బోర్డు, రాత్రి వేళల్లో ఛార్జింగ్ పాయింట్లను తప్పనిసరిగా ఆఫ్ చేయాలని అన్ని జోన్లకు సూచించింది.
నిజానికి 2014 నుంచే ఈ నిబంధన అమల్లో ఉన్నప్పటికీ, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సరిగ్గా అమలు కావడం లేదు. దీంతో సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు, నిబంధనల అమలును తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. గతంలో రైళ్లలో జరిగిన అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ఈ నిబంధన తీసుకొచ్చారు. ప్రస్తుతం ఛార్జింగ్ పాయింట్లను రాత్రివేళల్లో ఆఫ్ చేసే నిషేధం ఏసీ బోగీలకే పరిమితమైంది. రాత్రిపూట పరికరాలను ఛార్జింగ్‌లో ఉంచడం వల్ల వేడెక్కి మంటలు చెలరేగే ప్రమాదం ఉందని, దొంగతనాలకు కూడా అవకాశం ఉంటుందని రైల్వే శాఖ హెచ్చరిస్తోంది. అందుకే ప్రయాణానికి ముందే ఫోన్లను పూర్తిగా ఛార్జ్ చేసుకోవాలని సూచిస్తోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆ టైంలో ట్రైన్లలో మొబైల్ ఛార్జింగ్ బంద్!