Rahul Gandhi: ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నవంబర్ 1న ప్రతిపక్ష ఇండియా కూటమి భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. దాదాపు 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలను అడ్డుకునేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయత్నిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు.
రాంలీలా మైదానంలో జరిగే ర్యాలీకి ఎంతమంది వస్తారు, ఎంతమందిని అడ్డుకుంటారో చూస్తే దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతుందని రాహుల్ అన్నారు. కోట్లాది మంది ఓటు హక్కును కోల్పోతున్నారనే ఆవేదన ప్రజల్లో ఉందని, దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని చెప్పారు. అదానీ, అంబానీ, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌లకు ప్రయోజనం కలిగించేందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇది వేర్వేరు నిరసన కార్యక్రమం కాదని, ఒకే ఉద్యమమని పేర్కొన్నారు. ఈ పోరాటంలో ప్రతిపక్షాలన్నీ పాల్గొంటాయని, నిరసన తెలియజేయాలనుకునే ప్రతి ఒక్కరూ రాంలీలా మైదానానికి రావచ్చని పిలుపునిచ్చారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
‘‘ఢిల్లీ ర్యాలీకి ప్రజలు రాకుండా అడ్డంకులు’’.. కేంద్రంపై రాహుల్ ఆరోపణలు..