Zakir Naik: ఇస్లామిక్ ప్రచారకుడు జకీర్ నాయక్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో బాలికల విద్యపై తాలిబన్లు విధించిన నిషేధాన్ని ఆయన సమర్థించారు. భద్రతా కారణాలు, మహిళా ఉపాధ్యాయుల కొరత వల్లే విద్యను తాత్కాలికంగా నిలిపివేశారని పేర్కొన్నారు. అయితే, యునిసెఫ్ నివేదిక ప్రకారం 26 లక్షల మందికి పైగా ఆఫ్ఘన్ బాలికలు సెకండరీ విద్యకు దూరమయ్యారు. మహిళలకు యూనివర్సిటీ, వైద్య విద్యపై కూడా తాలిబన్లు ఆంక్షలు విధించారు.

జకీర్ నాయక్ వ్యాఖ్యలపై ఆఫ్ఘన్లు, పాకిస్థానీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బాలికలను చదువుకోనివ్వకుండా మహిళా ఉపాధ్యాయుల కొరత ఉందని చెప్పడం విడ్డూరమని పలువురు మండిపడ్డారు. నాయక్ తాలిబన్ల పాలనను అంతగా సమర్థిస్తే ఆఫ్ఘనిస్థాన్‌కు వెళ్లి అక్కడే జీవించాలని అమెరికన్ జర్నలిస్ట్ లీనా రోజ్బిహ్ విమర్శించారు. పాకిస్థానీ విద్యావేత్త జియావుద్దీన్ యూసుఫ్‌జాయ్ కూడా ఈ పరిణామాలపై విచారం వ్యక్తం చేశారు.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

 తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…

External Links:

జకీర్ నాయక్ వాదనను వ్యతిరేకించిన భారత్, పాక్, ఆఫ్ఘన్ మేధావులు.. అసలు ఏం జరిగిందంటే..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *