Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఓ రాజకీయ సభలో ఎప్స్టీన్ ఫైళ్లను విడుదల చేయాలని కోరుతూ టీషర్ట్ ధరించిన వ్యక్తిపై కొందరు ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారు. ‘Release the Epstein Files’ అని రాసి ఉన్న టీషర్ట్ ధరించిన అతడితో కొందరు వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత అతడిని కొట్టడంతో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. అయితే ఈ దాడిలో అతడికి ఎంతవరకు గాయాలయ్యాయి? ఈ ఘటనకు సంబంధించి ఎవరినైనా అరెస్టు చేశారా? అనే వివరాలు తెలియరాలేదు.
‘ది సండే గార్డియన్’ అక్టోబర్ 13న ప్రచురించిన కథనం ప్రకారం.. నిరసనకారుడిని బయటకు తీసుకెళ్తున్న సమయంలో ట్రంప్ వేదికపై నుంచి అతడిపై వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులు డబ్బులు ఇచ్చి ఇలాంటి వారిని సభలకు పంపిస్తున్నారని, వారు దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా, నిరసనకారుడిని ఇంటికి వెళ్లి తల్లితో ఉండాలని, బరువు తగ్గాలని చెబుతూ ‘లావుగా ఉన్నాడు’ అంటూ ఎగతాళి చేశారు. అయితే, ఈ ఘటనపై ట్రంప్ దాడిని ఖండించలేదని కథనం పేర్కొంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పుతిన్ యుద్ధాన్ని ఎందుకు సాగదీస్తున్నారో అర్థం కావడం లేదు…
ఇజ్రాయెల్ నుంచి ట్రంప్కు అత్యున్నత గౌరవం: ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ ప్రకటింపు
External Links:
ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు