Netanyahu Says Iran War: ఇరాన్‌తో మరోసారి యుద్ధం జరిగే అవకాశం ఉందని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెబుతున్నారు. ఇరాన్‌పై కొన్ని రోజుల పాటు సైనిక దాడులు చేసేందుకు అమెరికా మద్దతు పొందాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇటీవల మంత్రులు, భద్రతా అధికారులతో జరిగిన సమావేశంలో ఇరాన్‌పై మరోసారి దాడులు తప్పవని నెతన్యాహూ చెప్పినట్లు సమాచారం. ఇజ్రాయిల్, అమెరికా సైనిక అధికారులు దాడులకు సంబంధించిన ప్రణాళికలను కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై నాలుగు నుంచి ఏడు రోజుల పాటు వైమానిక దాడులు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నెతన్యాహూ ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు, ఇరాన్‌పై దాడుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోబోనని ఆయన స్పష్టం చేశారు. ఆక్సియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎలాంటి తొందర లేదని, కొత్త సంవత్సరం ప్రారంభమైన తర్వాత పరిస్థితులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ తెలిపారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పుతిన్ యుద్ధాన్ని ఎందుకు సాగదీస్తున్నారో అర్థం కావడం లేదు…
ఇజ్రాయెల్ నుంచి ట్రంప్‌కు అత్యున్నత గౌరవం: ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ ప్రకటింపు
External Links:
ఇరాన్‌పై 7 రోజుల వైమానిక దాడులకు ప్లాన్? ట్రంప్ నిర్ణయం కోసం నెతన్యాహు ఎదురుచూపులు