Nvidia: అమెరికా చిప్ దిగ్గజం ఎన్విడియా కీలక నిర్ణయం తీసుకుంది. మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, సింగపూర్ దేశాలకు సర్వర్ల సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు డెల్, సూపర్‌మైక్రో సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిషేధం తాత్కాలికమా, శాశ్వతమా అనే దానిపై స్పష్టత లేదు. చైనాకు అధునాతన ఏఐ చిప్‌లు చేరకుండా అమెరికా ఎగుమతి ఆంక్షలను కఠినతరం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మరోవైపు, ఎన్విడియా చిప్‌లను చైనాకు తరలించారనే ఆరోపణలతో సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ కంపెనీకి చెందిన అలిస్ హువాంగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆమె చైనా తరఫున గూఢచర్యం చేస్తున్నట్లు అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏఐ చిప్‌ల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అమెరికా మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పుతిన్ యుద్ధాన్ని ఎందుకు సాగదీస్తున్నారో అర్థం కావడం లేదు…
ఇజ్రాయెల్ నుంచి ట్రంప్‌కు అత్యున్నత గౌరవం: ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ ప్రకటింపు
External Links:
చైనాకు AI చిప్‌లు చేరకుండా అమెరికా వ్యూహం.. నాలుగు దేశాలకు ఎన్విడియా షాక్!


