Nobel Peace Prize: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాదైనా నోబెల్ శాంతి బహుమతి వస్తుందని ఆశించినప్పటికీ నిరాశే ఎదురైంది. 2026 నోబెల్ శాంతి పురస్కారానికి భారత తమిళ మూలాలున్న దక్షిణాఫ్రికా న్యాయవేత్త నవనీతం “నవీ” పిళ్లై ఎంపికయ్యారు. మానవ హక్కుల పరిరక్షణ, అంతర్జాతీయ న్యాయం, శాంతి స్థాపనకు ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు. డర్బన్‌లో జన్మించిన ఆమె, వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వారికి న్యాయ సహాయం అందించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించి, దక్షిణాఫ్రికా హైకోర్టు న్యాయమూర్తిగా, రువాండా అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్ అధ్యక్షురాలిగా, 2008 నుంచి 2014 వరకు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా పనిచేశారు.
నవీ పిళ్లై పాలస్తీనా భూభాగాలపై ఐరాస విచారణ కమిషన్‌కు అధ్యక్షత వహించడంతో పాటు, అంతర్జాతీయ న్యాయ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆమెకు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించడంపై ఐరాస మానవ హక్కుల కార్యాలయం హర్షం వ్యక్తం చేసింది. ఈ పురస్కారం కింద 1.2 కోట్ల స్వీడిష్ క్రోనాలు (సుమారు 12 లక్షల అమెరికన్ డాలర్లు) నగదు బహుమతిగా అందజేస్తారు. డిసెంబర్ 10న నార్వే రాజధాని ఓస్లోలో అవార్డును ప్రదానం చేయనున్నారు.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

పుతిన్ యుద్ధాన్ని ఎందుకు సాగదీస్తున్నారో అర్థం కావడం లేదు…

ఇజ్రాయెల్ నుంచి ట్రంప్‌కు అత్యున్నత గౌరవం: ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ ప్రకటింపు

External Links:

ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *