Bhutan PM: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు దేశాధినేతలు ఆయనకు అభినందనలు తెలిపారు. భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే మోదీని “విష్ణువు అవతారం”గా అభివర్ణించారు. 2019లో ఢిల్లీలో మోదీని వ్యక్తిగతంగా కలిసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్న ఆయన.. మోదీలో జ్ఞానం, కరుణ, ధైర్యం, నిస్వార్థ సేవ వంటి లక్షణాలను చూశానని తెలిపారు. మోదీ తనపై చూపిన ఆప్యాయత తనను ఎంతో ప్రభావితం చేసిందని, అందుకే ఆయనను తన అన్నయ్యగా భావిస్తానని టోబ్గే చెప్పారు.
మోదీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి, లోక్సభ ఎన్నికల్లో వరుసగా మూడు విజయాల అనంతరం ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వాధినేతగా ఆయన 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టోబ్గే తన అభినందనలు తెలిపారు. భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న మోదీ లక్ష్యాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పుతిన్ యుద్ధాన్ని ఎందుకు సాగదీస్తున్నారో అర్థం కావడం లేదు…
ఇజ్రాయెల్ నుంచి ట్రంప్కు అత్యున్నత గౌరవం: ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ ప్రకటింపు
External Links:
మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు