Senior actress vatsala rajagopal Passes Away: ప్రముఖ సీనియర్ నటి వత్సల రాజగోపాల్ (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన ఆమె పెళ్లి తర్వాత చెన్నైకి వచ్చారు. క్లర్క్‌గా పనిచేస్తూనే నాటకాలపై ఆసక్తితో రంగస్థలంపై నటించేవారు. ఆమె నాటకాలు చూసిన దర్శకుడు మణిరత్నం.. ‘రోజా’ సినిమాలో అమ్మమ్మ పాత్ర ద్వారా ఆమెను వెండితెరకు పరిచయం చేశారు. అప్పటికి ఆమె వయసు 60 ఏళ్లు.
ఆ తర్వాత సతీ లీలావతి, అన్నియన్, మొళి, రిథమ్, విన్నర్, ధామ్ ధూమ్, కళ్యాణ సమయల్ సాదం వంటి ఎన్నో తమిళ చిత్రాల్లో నటించారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రయాణంలో సుమారు 400 చిత్రాల్లో నటించారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వినాయక్ దర్శకత్వం వహించిన ‘అదుర్స్’ సినిమాలో బామ్మ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఎలాంటి పాత్రలోనైనా సహజంగా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….