Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. జోషిమఠ్ సమీపంలోని హతి పహాడ్ వెనుక ఉన్న చాయీ గ్రామం దగ్గర హెలికాప్టర్ కూలినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఆరుగురు ఉన్నట్లు సమాచారం. ఇది ట్రాన్స్ భారత్ కంపెనీకి చెందినదిగా, ఫాటా నుంచి బద్రీనాథ్ వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రయాణికులు చంద్రకాంత్, రాజశ్రీ, దినేష్, ఆకాష్, అథర్వతో పాటు పైలట్ హిమాంశుగా గుర్తించారు. అయితే వారు సురక్షితంగా ఉన్నారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. హెలికాప్టర్ శకలాలు కూడా ఇప్పటివరకు లభించలేదు.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన మేఘాలు, వర్షం కారణంగా విజిబిలిటీ తక్కువగా ఉండటంతో హెలికాప్టర్ ఆచూకీ గుర్తించడం కష్టంగా మారింది. ప్రస్తుతం బద్రీనాథ్, జోషిమఠ్ ప్రాంతాల్లో స్థానిక అధికారులు, రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సహాయక చర్యల కోసం మరో రెండు హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు. హెలికాప్టర్ కూలిన విషయాన్ని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ధ్రువీకరించారు. జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ శాఖ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కలిసి సహాయక చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. ప్రయాణికులు క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. కాగా, అక్టోబర్‌లో చార్ధామ్ యాత్ర సమయంలో కూడా ప్రతికూల వాతావరణం, సాంకేతిక సమస్యల కారణంగా రెండు హెలికాప్టర్లు అత్యవసరంగా ల్యాండ్ అయ్యాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి.?