China Markets Crashed: చైనా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రముఖ CSI 300 ఇండెక్స్ అక్టోబర్ 30 నాటికి వరుసగా 12వ వారం కూడా నష్టాల్లో ముగిసింది. 2005లో ఈ ఇండెక్స్ ప్రారంభమైన తర్వాత ఇంతటి పతనం ఇదే తొలిసారి. గత మే నెల గరిష్ట స్థాయి నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.329 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. షాంఘై, షెంజెన్ ఎక్స్ఛేంజ్లలోని 300 ప్రధాన కంపెనీలను ట్రాక్ చేసే ఈ ఇండెక్స్ 20 శాతానికి పైగా పడిపోయి బేర్ మార్కెట్లోకి ప్రవేశించింది. దేశీయంగా ప్రజల ఖర్చులు తగ్గడం, కంపెనీల మధ్య పోటీ పెరగడం, లాభాలు తగ్గడం ఈ పతనానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
మరోవైపు కంపెనీల త్రైమాసిక ఫలితాలు కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. MSCI చైనా ఇండెక్స్‌లోని కంపెనీలు అంచనాల కంటే 9 శాతం తక్కువ లాభాలు నమోదు చేశాయి. ఏఐ, టెక్నాలజీ రంగాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నప్పటికీ, భవిష్యత్తులో లాభాలు వస్తాయో లేదోననే ఆందోళనతో పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతున్నారు. రియల్ ఎస్టేట్ సంక్షోభం కూడా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసింది. చైనా ఆర్థిక వ్యవస్థ మూడో త్రైమాసికంలో 4.5 శాతం వృద్ధి సాధించినప్పటికీ, ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలు మార్కెట్లకు ఆశించిన ఊరటనివ్వలేకపోయాయి. దీంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరుగుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!