Mule Accounts: హైదరాబాద్లో అమాయకుల పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిపించి సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న ముఠాను చార్మినార్ టాస్క్ఫోర్స్, అత్తాపూర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు. నిందితులు ఒక్కో ఖాతాను రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు విక్రయించినట్లు గుర్తించారు.
పోలీసుల విచారణలో నగరవ్యాప్తంగా 83 మ్యూల్ ఖాతాలు తెరిచి, వాటిలో 11 ఖాతాల ద్వారా 14 సైబర్ మోసాలకు పాల్పడినట్లు తేలింది. ఈ ఖాతాల ద్వారా రూ.10.04 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. నిందితులపై కేసులు నమోదు చేసి పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నారు. ప్రజలు తమ బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులను ఇతరులకు ఇవ్వవద్దని, సైబర్ మోసాలపై 1930కు ఫిర్యాదు చేయాలని పోలీసులు హెచ్చరించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రేణు అగర్వాల్ దారుణ హత్య
External Links:
సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!