UP Farmers Relief: ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులు, బాధిత కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పరిహారాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. విపత్తుల్లో మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచింది. అలాగే పంట నష్టపరిహారాన్ని 30 శాతం వరకు పెంచడంతో పాటు పశువులు, కోళ్లు, వ్యవసాయ భూములకు కూడా అదనపు సాయం అందించనుంది.

ఇళ్లను కోల్పోయిన కుటుంబాలు, దెబ్బతిన్న పాఠశాలలు, ఇతర ఆస్తుల మరమ్మతులకు కూడా ఆర్థిక సహాయం అందించనుంది. బాధిత కుటుంబాలకు 30 రోజుల వరకు, కరువు పరిస్థితుల్లో తాగునీటి సరఫరాకు 90 రోజుల వరకు సాయం కల్పించనుంది. ఈ కొత్త పరిహార నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 4 వరకు జరిగిన నష్టాలకు వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

 తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…

External Links:

తులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన యోగి సర్కార్.. అన్నదాతకు భారీ ఊరట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *