Gollabuddharam Murder: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం గ్రామ తండాలో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. అజ్మీర చందు (30)ను అతడి భార్య పావని, ఆమె ప్రియుడు సంతోష్ కలిసి ఇంట్లోనే హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అనంతరం మృతదేహాన్ని ఎడ్లబండిపై తరలించి చికెన్‌పల్లి సమీపంలోని రోడ్డు పక్కన పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

డీఎస్పీ సంపత్ రావు, సీఐలు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు పావని, సంతోష్ పరారీలో ఉండటంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసును భూపాలపల్లి సీఐ శ్రీనివాస్ దర్యాప్తు చేస్తున్నారు.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రేణు అగర్వాల్ దారుణ హత్య

ఎర్రకోటలో భారీ చోరీ…

External Links:

ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన భార్య.. మృతదేహాన్ని ఎడ్లబండిపై తరలించి..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *