Ipl 2027 Csk And Srh

Ipl 2027 Csk And Srh: ఐపీఎల్ 2027కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య కీలక ట్రేడ్ డీల్ జరిగింది. సీఎస్కేకు చెందిన ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ హైదరాబాద్‌కు వెళ్లగా, వారి స్థానంలో లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్ చెన్నై జట్టులో చేరనున్నారు. లివింగ్‌స్టోన్ రూ.6 కోట్లకు, జాక్ ఎడ్వర్డ్స్ రూ.3 కోట్లకు సీఎస్కేకు రానున్నారు. మరోవైపు ఖలీల్‌ను రూ.4.8 కోట్లకు, ఎల్లిస్‌ను రూ.2 కోట్లకు హైదరాబాద్ తీసుకుంది.

లివింగ్‌స్టోన్ రాకతో చెన్నై బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు బలపడనున్నాయి. అతడు 370 టీ20 మ్యాచ్‌ల్లో 8,595 పరుగులు చేసి, 171 వికెట్లు పడగొట్టాడు. గాయం కారణంగా గత సీజన్‌కు దూరమైన జాక్ ఎడ్వర్డ్స్ ఇటీవల ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి ఆకట్టుకున్నాడు. ఇక ఐపీఎల్ 2027 ఆటగాళ్ల రిటెన్షన్ గడువును నవంబర్ 17 వరకు పొడిగించారు. మినీ వేలం డిసెంబర్ 16న గోవాలో జరగనుంది.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..

నిఖత్ జరీన్‌కు స్వర్ణం..

External Links:

సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *