E20 Petrol New Controversy

E20 Petrol New Controversy: E20 పెట్రోల్‌పై కర్ణాటక ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాల్సి ఉండగా, కొన్ని చమురు కంపెనీలు అంతకంటే ఎక్కువగా కలుపుతున్నాయని తెలిపింది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల నుంచి సేకరించిన 63 నమూనాలను పరీక్షించగా, ఇండియన్ ఆయిల్‌లో 31.2 శాతం, హెచ్‌పీసీఎల్‌లో 30.5 శాతం, బీపీసీఎల్‌లో 26.5 శాతం ఇథనాల్ ఉన్నట్లు గుర్తించామని వెల్లడించింది. ఈ నివేదికను కేంద్రానికి పంపించనున్నట్లు తెలిపింది.

ఇథనాల్ శాతం పెరగడం వల్ల వాహనాల మైలేజీ తగ్గడంతో పాటు ఇంజిన్ పనితీరు, నిర్వహణ ఖర్చులపై ప్రభావం పడుతుందని కర్ణాటక ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యపై కేంద్రం జోక్యం చేసుకుని, నష్టపోయే వాహనదారులకు పరిహారం అందించాలని మంత్రి రిజ్వాన్ అర్షద్ కోరారు. తాజా ఆరోపణలపై కేంద్రం, చమురు కంపెనీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

 తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…

External Links:

తులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన యోగి సర్కార్.. అన్నదాతకు భారీ ఊరట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *