Ap Local Body Elections 2026

Ap Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ప్రజలు భారీ విజయాన్ని అందించారని సీఎం చంద్రబాబు అన్నారు. 2024 ఎన్నికలతో పోలిస్తే ఈసారి మరింత మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో కూటమికి 59 శాతం ఓట్లు, 94 శాతం స్ట్రైక్ రేట్ నమోదైందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమికి మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో కూటమికి 58.9 శాతం, వైసీపీకి 33.56 శాతం ఓట్లు వచ్చాయని, రెండు పార్టీల మధ్య 25.34 శాతం ఓట్ల తేడా ఉందని వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్‌లోనూ కూటమికి మంచి మద్దతు లభించిందని పేర్కొన్నారు. ఈ ఫలితాలు అభివృద్ధికి, సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన మద్దతుగా భావిస్తున్నానని, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నికల్లో డబ్బు పంపిణీ, అనవసర ఖర్చులను తగ్గించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నాయకులు డబ్బు ఖర్చు చేయడం కంటే సేవాభావంతో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎన్నికల్లో పెట్టిన డబ్బును తిరిగి సంపాదించుకోవాలనే ఆలోచనకు దూరంగా ఉండాలని అన్నారు. ఎన్నికల సమయంలోనే కాకుండా నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ జవాబుదారీతనంతో పనిచేయాలని పేర్కొన్నారు. రాజకీయాల్లో కొత్త మార్పులు రావాలని, ఆర్థిక అసమానతలు తగ్గి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, ప్రజాసేవే రాజకీయాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..

నిఖత్ జరీన్‌కు స్వర్ణం..

External Links:

వరి నారుతో సీఎం ‘రేవంత్ రెడ్డి’ చిత్రపటం.. వినూత్నంగా బర్త్‌డే విషెస్ తెలిపిన కాంగ్రెస్ నేత.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *