Cyclone Alert Severe Storm: ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో రానున్న 48 గంటల్లో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే అండమాన్ సముద్రం పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది క్రమంగా బలపడి ఎల్లుండి నాటికి వాయుగుండంగా, ఈ నెల 19వ తేదీ నాటికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై పడే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. అయితే తుఫాన్ దిశ, తీవ్రత, తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను తీర ప్రాంత ప్రజలు గమనించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే రెండు తుఫాన్లతో ఏపీకి తీవ్ర నష్టం జరగడంతో, మరో తుఫాన్ ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ప్రజల్లో ఆందోళన నెలకొంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..
External Links:
ఏపీకి మరో తుఫాన్ ముప్పు..? విశాఖ–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం..!