Ipl 2027 Rohit Sharma: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ మళ్లీ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాగే యువ ఆటగాడు తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. భవిష్యత్తులో తిలక్ వర్మను కెప్టెన్‌గా సిద్ధం చేయాలనే ఉద్దేశంతో ముంబై యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐదు సార్లు (2013, 2015, 2017, 2019, 2020) ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. మరోవైపు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ రేసులో లేరని ప్రచారం జరుగుతోంది. సూర్య ఆటగాడిగా కొనసాగనుండగా, బుమ్రా పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. రోహిత్‌ను మళ్లీ కెప్టెన్‌గా నియమిస్తారా, తిలక్‌కు వైస్ కెప్టెన్సీ ఇస్తారా అనేది ముంబై యాజమాన్యం అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టమవుతుంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..
External Links:
ముంబై ఇండియన్స్ వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. కెప్టెన్ ఎవరంటే?



