Municipal Elections

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్టోబర్ చివరి నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. ఎన్నికల సంఘం ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో సమావేశాలు నిర్వహిస్తోందని, ఓటర్ల జాబితా సిద్ధం చేసి ఖరారు చేయాలని కోరిందని చెప్పారు. స్థానిక సంస్థలకు సంబంధించిన కొన్ని చట్టాల్లో సవరణలు చేస్తున్నామని, వాటిని అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నామని తెలిపారు. అలాగే బీసీ రిజర్వేషన్లపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందని, దాన్ని పరిశీలించి రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్న తర్వాత జీవో జారీ చేస్తామని కోర్టుకు వివరించారు.

రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకోవాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తే ఎన్నికలు మరింత ఆలస్యం కావచ్చని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రెండు పిల్‌లను హైకోర్టు విచారించింది. కమిషన్ నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచాలని పిటిషనర్లు కోరగా, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత నివేదికను విడుదల చేస్తామని ఏజీ తెలిపారు. పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *