Heavy Devotee Rush At Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం సెలవు కావడంతో దుర్గమ్మ దర్శనం, ఆషాఢ సారె సమర్పణ కోసం భారీ సంఖ్యలో భక్తులు, ముఖ్యంగా మహిళలు తరలివచ్చారు. ఉదయం నుంచే ఘాట్ రోడ్, కనకదుర్గ నగర్ మార్గాల్లో రద్దీ పెరిగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 65 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, వారిలో 57 బృందాలుగా 23,916 మంది సారె సమర్పించారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఆలయ అధికారులు డిజిటల్ స్కానింగ్ విధానాన్ని అమలు చేసి, సారె సమర్పించే భక్తులకు ప్రత్యేకంగా రూ.100 ‘భవాని అనుగ్రహ దర్శన్’ క్యూ లైన్‌ను కేటాయించారు.
భక్తుల సౌకర్యం కోసం ఆలయ అధికారులు పలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ అంతరాలయ దర్శనాలు, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీఐపీ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేశారు. అన్ని దర్శన టికెట్లను ఉచిత దర్శనాలుగా మార్చి, క్యూ లైన్లలో చల్లని తాగునీటిని అందించారు. వచ్చిన భక్తులందరికీ ఉచిత ఆశీర్వచనం, ప్రసాదం పంపిణీ చేశారు. ఆలయ ఈవో శీనా నాయక్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..
External Links:
జులై 15 నుంచి ఆషాఢం ప్రారంభం..విశిష్టత.. ప్రత్యేకమైన రోజులు ఇవే.!