ధర్మ ప్రచార మహోత్సవంలో భాగంగా విశాఖపట్నంలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజలు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. భక్తులు స్వయంగా పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళలు పూజలకు హాజరయ్యారు. గత నెల 12న ప్రారంభమైన మహోత్సవాలు ఈ నెల 29 వరకు కొనసాగనున్నాయి. తాడేపల్లిగూడెంలోని బలుసులమ్మ ఆలయంలో విశాలమైన ప్రాంగణంలో పూజలు నిర్వహించారు.
పూజల్లో పాల్గొన్న మహిళలకు ఉచితంగా పూజా ద్రవ్యాలు అందించగా, వేదపండితులు క్రతువులు నిర్వహించారు. ఈ పూజలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన మహిళలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. వివిధ కమిటీ సభ్యులు, నిర్వాహకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.